NTV Telugu Site icon

Bandi Sanjay: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు..

Bandi Sanjay Praja Yatra

Bandi Sanjay Praja Yatra

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డేనని విమర్శించారు. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు మీదున్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై ఎందుకు లేదు రేవంతన్నా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

PM Modi: మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం..

ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ను గద్దె దించిన చరిత్ర తమదని.. లాఠీదెబ్బలు, కేసులు, అరెస్టులు, జైళ్లకు భయపడకుండా రాజీలేని పోరు చేశామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా, కాంగ్రెస్ మెడలు వంచేదాకా కొట్లాడతామని బండి సంజయ్ పేర్కొన్నారు. మోడీ, అమిత్ షాపై అసభ్యంగా వాగుతున్న కాంగ్రెస్ నేతలారా…ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. కాషాయ కార్యకర్తలు ఉరికించి కొడతారు… జాగ్రత్త అని అన్నారు. కేసీఆర్ ఓ తుపాకీ రాముడు… జనాన్ని మోసం చేసేందుకు మళ్లీ మాయ మాటలు చెబుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మర్చిపోనంతగా ప్రజలకు ద్రోహం చేశారని.. దేవుడి అక్షింతలు, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని బొంద పెడతామని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: షారుఖ్ కంటే నాకే ఎక్కువిస్తానన్నారు.. పవన్ కామెంట్స్ వైరల్