NTV Telugu Site icon

Bandi Sanjay: తెలంగాణ సీఎంను పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుపట్టిన కేంద్రమంత్రి..

Bandi Sanjay

Bandi Sanjay

కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందో అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో గొప్పగా కనబడ్డాడో అర్థం కాలేదన్నారు. అల్లు అర్జున్ కి రేవంత్ కి ఎక్కడో చెడింది.. అందుకే పుష్ప 3 చూపించాడు రేవంత్ అని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు చేయనందున.. మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి నచ్చరేమో అంటూ చెప్పుకొచ్చారు.

Read Also: CM Revanth: సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మరిన్ని పెట్టుబడుల కోసం చర్చ

రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది.. మహిళలపై అత్యాచారాలు పెరిగాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కమీషన్ల దందా సాగుతుంది.. 8 శాతం నుంచి 14 శాతం కమిషన్ ని పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల కమీషన్ల దందా నడుస్తుంది.. ఓ ముగ్గురు మంత్రులు విచ్చలవిడిగా దందా చేస్తున్నారని తెలిపారు. అ అంశంపై విచారణ చేస్తున్నాం త్వరలో పేర్లు బయట పెడతామన్నారు. కమీషన్ల విషయంలో కాంగ్రెస్ మంత్రుల మధ్య అంతర్యుద్ధం సాగుతోందని పేర్కొన్నారు. త్వరలో విభేదాలు బయటపడతాయని చెప్పుకొచ్చారు.

Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ లాంచ్ తేదీ ప్రకటన.. ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ!

మరోవైపు.. రాష్ట్రంలో సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావాడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ‌కారణమని బండి సంజయ్ దుయ్యబట్టారు. బకాయిలు మొత్తం చెల్లిస్తానంటే జెండాలు పక్కనపెట్టి కాంగ్రెస్ ‌పార్టీకి సర్పంచ్‌లు మద్దతు ఇచ్చారన్నారు. కానీ.. సర్పంచ్‌లు అప్పులపాలై‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.. మాజీ సర్పంచ్‌లు బతుకుదెరువు కోసం దుబాయ్ పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రూ.1300 కోట్ల సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతి ఎన్నికలలో జెండాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ది వస్తుందని బండి సంజయ్ అన్నారు.

Show comments