NTV Telugu Site icon

Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అనే అంశంపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిన పార్టీ , ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్న ఏమి ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి , కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. కేటీఆర్ , కేసీఆర్ లను ప్రజలు చీదరించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారన్నారు.

Read also: Nirmal: గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..

వారి విలీనం పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకే , బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని ప్రచారం చేస్తున్నారన్నారు. మొదట కాంగ్రెస్ నాయకుడైన కేసీఆర్ ఆ పార్టీలోకే పోతారన్నారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదు… ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు. ఆరు గ్యారెంటీ లను పక్కదోవ పట్టించడానికే ఈ ప్రచారానికి తెరలేపారన్నారు. రుణ మాఫీ పై రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. బ్యాంక్ ల నుండి ఎన్వోసి లు ఇప్పించాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదన్నారు. రైతుల పక్షాన బీజేపీ కొట్లాడుతుందన్నారు.

Read also: Nirmal: గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..

అనంతరం హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మేన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ… అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్ జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని… కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు.

Read also: Rains Updates: ఈరోజు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

క్లినిక్, లైబ్రరీ, సమావేశం మందిరం, శిక్షణ సేవకార్యక్రమలు కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. గొప్ప వ్యక్తుల చరిత్రను గెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారత దేశంపై కుట్రలు చేస్తున్నాయని… దీన్ని ప్రధాని మోదీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. బంగ్లాదేశ్ లో భారతీయులపై దాడులపై మాట్లాడుతున్న వారు… మొదట భవిష్యత్ లో భారత్ లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవలో ఆలోచించాలని కోరారు. హిందు ధర్మం పరిరక్షణ కోసం ముందుకు రావాలని… గోహత్యాలు, లవ్ జిహాదీ నియంత్రించడం కోసం ఇలాంటి కేంద్రాలలో సమావేశలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు.
CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్‌ సింఘ్వీ నామినేషన్..