Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- “అన్నా” అన్నందుకే ఆగ్రహం.. ఎస్సై దాడి
- సెలూన్‌లో సీసీటీవీకి రికార్డైన ఘటన
- సోషల్ మీడియాలో వైరల్.. పోలీసులపై విమర్శలు
- చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar SI assault : కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి అత్యుత్సాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), కేవలం తనను ‘అన్నా’ అని పిలిచినందుకు ఒక సామాన్య కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఖానాపూర్ ఏరియాలో ఉన్న ఒక సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించుకోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా “కూర్చో అన్నా” అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
“నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించడం ఆ అధికారి అహంకారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూస్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్‌లోని సిసిటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యుడైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు , స్థానికులు కోరుతున్నారు.
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!