Viral News : వాట్సాప్ గ్రూపుల్లో కానిస్టేబుల్ సందేశం కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని పోలీసు స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయంలో ఓ కానిస్టేబుల్ మన స్తాపం చెంది ఆడియోలో చెప్పిన ఆవేదన పలు వాట్సాప్ గ్రూపుల్లో తిరగడం కలకలం రేపింది. సదరు కానిస్టేబుల్ ‘ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో నిబంధనలతో భార్యాభర్తలు విడిపోయామని.. చెరోచోటా దూరంగా ఉన్నామని.. మాకు చిన్నపిల్లలున్నారని.. మనోవేదనకు గురవుతున్నామని.. తనలాగే చాలా మంది కానిస్టేబుల్లు బాధపడుతున్నారని.. 11వ తేదీ వరకు స్పౌస్ ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నామని.. ఇప్పటికే నెలల తరబడి ఇబ్బంది పడుతున్నామని.. 11వ తేదీ వరకు ట్రాన్స్ఫర్ చేయకపోతే 12వ తేదీన ఆత్మ హత్య చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఈ వాయిస్ మెస్సేజ్ గ్రూపుల్లో వైరల్ అయింది. దీంతో పోలీసుశాఖలో పెద్ద చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 317 జీవో కారణంగా ఎంతో మంది భార్యభర్తలు మానసిక క్షోభకు గురవుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికొంతమంది జీవితాల్లో 317 జీవో విషాదంతం కూడా నింపిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ వాట్సాప్ మేసేజ్ ఎక్కడిదని తెలుసుకునే పనిలో పోలీస్ శాఖ ఉంది.
Also Read
తాజావార్తలు
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్‌లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్‌ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!