Cyber Fraud: కామారెడ్డి జిల్లాలో సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మీకూతురు ఆపదలో ఉందంటూ లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన వాడు. తనకు రాధవి అనే కూతురు ఉంది. తన కూతురు అమెరికాలో ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. ఒకరోజు వెంకట్ రెడ్డికి ఓ గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆఫోన్ ను లిప్ట్ చేసి వెంకట్ రెడ్డి మాట్లాడాడు. మీ కూతురు రాధవి ఆపదలో ఉందంటూ ఫోన్ రావడంతో వెంకట్‌రెడ్డి షాక్ తిన్నాడు. అవతనుంచి ఫోన్ చేసిన ఎవరు ఏంటి అనేది ఆరా తీయలేకపోయాడు. ఆ వ్యక్తి మాటలకు వెంకట్ రెడ్డికి చమటలు పట్టాయి. తన కూతురు రాధవి నిజంగానే ఆపదలో ఉందా? అంటూ కాసేపు ఆ తండ్రికి ఊపిరి ఆగినంత పనైంది. ఏం జరిగింది నా కూతురికి అని అవతల వ్యక్తికి ప్రశ్నించాడు. నీ కూతురు ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందని చెప్పారు.
Read also: Viral News : కలియుగ సావిత్రి.. గాయపడిన భర్తను ఆసుపత్రికి మోసుకెళ్లిన మహిళ
దాంతో నీ కూతురిపై కేసు నమోదైందని తెలిపారు. నా కూతురు రాధవిని కాపాడాలంటూ వెంకట్ రెడ్డి వేడుకున్నాడు ఆ తండ్రి. మీ కూతురును కేసు నుంచి తప్పించాలంటే రెండు లక్షలు పంపాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో అవతలి వ్యక్తి మాటలు నమ్మి మూడు దపాలుగా ఓక లక్ష రూపాయలు పంపాడు వెంకట్ రెడ్డి. మళ్లీ తిరిగి అదే నెంబర్ కు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే కూతురికి ఫోన్ చేశాడు. దీంతో ఫోన్ రిసీవ్ చేసిన రాధవి నాన్న వెంకట్ రెడ్డితో మాట్లాడింది. వెంకట్ రెడ్డి.. రాధవికి అసలు వ్యవహారం చెప్పగా నాకేమి కాలేదంటూ బదులిచ్చింది రాధవి. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకట్ రెడ్డి వెంటనే మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మాచారెడ్డి పోలీసులు.
Mehandipur Balaji: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వణుకు పుట్టాల్సిందే.. మీకు ధైర్యం ఉందా..?