TPCC Mahesh Goud : కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీ దోపిడి జరిగింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం. వాటా లో తేడా కారణంగానే కవిత నిజం చెబుతున్నట్లు అర్థమవుతోంది” అన్నారు.
Dhadi Shetty Raja: ప్రజా సమస్యలపై మాట్లాడితే సీఎం తిడుతున్నారు.. ఇది పద్ధతేనా?
అలాగే మహేష్ కుమార్ గౌడ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత దోపిడీ గురించి చెప్పి ఉంటే సన్మానించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ – కవిత డ్రామా ఆడుతున్నారు” అని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. “ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. బీజేపీ నాయకుల బండారం బయట పెట్టేందుకు సగం క్యాబినెట్‌నే కామారెడ్డికి తీసుకువచ్చారు. ఈ సభ ద్వారా కేంద్రంపై సమర భేరి మోగిస్తాం. బండి సంజయ్, కిషన్ రెడ్డి బండారాన్ని బయట పెడతాం” అని ఆయన హెచ్చరించారు.
Eating During Eclipse: గ్రహణం సమయంలో ఆహారం తింటున్నారా? ఏమి జరుగుతుందో తెలుసా!
