Site icon NTV Telugu

Kalvakuntla Kavitha: రాష్ట్ర రైతులపై బీజేపీది సవతి తల్లి ప్రేమ

తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్‌ రైస్‌ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత.

https://ntvtelugu.com/women-farmers/

రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బండి సంజయ్ యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోండి. మీకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారు. మీ అర్థ జ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

గతకొంతకాలంగా ధాన్యం కొనుగోలుకి సంబంధించి బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Exit mobile version