Tiger Missing: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోంది..? ఒక పులి మృతి చెందిన రెండు రోజులకే మరో పులి మృతి చెందడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరో నాలుగు పులులు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోందో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చనిపోయిన పులులు ఒక్కటే కాదు.. ఒకే కుటుంబానికి చెందినవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాగజ్ నగర్ అడవుల్లో ఓ మగపులి, ఆడపులి తమ నాలుగు పిల్లలతో కలిసి నివాసం ఏర్పాటు చేసుకోగా.. అందులో మగపులి, ఒక పిల్ల మృత్యువాత పడ్డాయి. మిగిలిన తల్లి పులి, మూడు పిల్లలు ఏమయ్యాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
Read also: Guntur Kaaram: ఆ సినిమా అవ్వకుంటే చాలు దేవుడా…
మొదటి పులి మృతి చెందిన రోజు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది సిబ్బందితో పాటు అటవీశాఖాధికారులు కాగజ్ నగర్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులుల జాడ కోసం గాలిస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అడవిలో అమర్చిన సీసీ కెమెరాల్లో పులుల జాడ లేకపోవడంతో… అవి బతికే ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చనిపోయిన పులులపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా చనిపోయిన పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని పరిశీలించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవు శరీరంపై గడ్డి, ఇతర విషపదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇది కచ్చితంగా వేటగాళ్ల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Budget 2024 : నో డౌట్…మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే.. గందరగోళం లేదు