K.A.Paul: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో కే.ఏ.పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. అందరి అభివృద్ధి ప్రజాశాంతి పార్టీ ధ్యేయమన్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్స్ లే ముద్దంటూ వ్యాఖ్యానించారు పాల్. దేశాన్ని ప్రధాని మోడీ సీఎం, కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రాక ముందుకు అదాని ఎవరో తెలియదన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో ధనికుడు అదాని అది ఎలా సాధ్యపడింది మోడీ ద్వారానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్. లక్షల కోట్లు అప్పు చేసే కేసిఆర్ కావాలా.. లక్షల కోట్లు తీసుకొచ్చే కేఏ పాల్ కావాలా ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
Read also: Venkaiah Naidu: పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది పింఛన్లు అందక లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీ, దళిత బంధు దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, ఎస్సి, ఎస్టీల రిజర్వేషన్ అమలు ను కేసీఆర్ తుంగలోకి తొక్కారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెచ్చిన MNC కంపెనీలు తప్ప.. కొత్త కంపెనీలను సీఎం జగన్ తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ల్యాండ్, సాండ్ మాఫియా హవా కొనసాగుతుందని కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Che Guevara Daughter: నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి