Site icon NTV Telugu

Justice Sudershan Reddy : తెలుగు రాష్ట్రాల పార్టీల వైఖరిపై జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Sudershan Reddy

Sudershan Reddy

Justice Sudershan Reddy : ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌టివీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవి కాదని, రాజ్యాంగ పదవని, ఈ వ్యత్యాసాన్ని తెలుగు రాష్ట్రాల పార్టీలు గుర్తించాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలకు పిలుపునిస్తూ, “తెలుగు ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? తెలంగాణ అస్థిత్వం ఏమై పోయింది?” అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిందని, కానీ టిడిపి, బిఆర్ఎస్ నేతలను సంప్రదించే తన ప్రయత్నాలు విఫలమయ్యాయని, వారు స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Jason Miller: రంగంలోకి భారత లాబీయిస్ట్ జాసన్ మిల్లర్.. ట్రంప్‌తో భేటీ..

కనీసం మాట్లాడటానికైనా ఇరు పార్టీల నాయకులు వెనుకడుగు వేసిన విధానం శోచనీయమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాక, గతంలో తాను ఇచ్చిన “సల్వా జుడుం” తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా విఫలయత్నంగా మిగిలిపోయాయని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు, లక్నో వంటి ప్రాంతాల్లో తన అభ్యర్థిత్వానికి అప్రతീക്ഷితమైన మద్దతు లభించిందని వెల్లడించిన ఆయన, “న్యాయమూర్తిగా చూసిన రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. 1971 నుంచి నేను రాజ్యాంగబద్ధంగా నడిచాను. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడం ఆ ప్రయాణానికి కొనసాగింపే” అని తెలిపారు.

Bill Gates: ఏఐ వల్ల మీ ఉద్యోగాలకు ముప్పు లేదు..? ఎందుకో వివరణ ఇచ్చిన బిల్ గేట్స్..!

Exit mobile version