MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌పై నేడు తీర్పు రానుంది. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. ఈరోజు కవిత బెయిల్‌పై రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెలువడనుంది. మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఉన్నాడు. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడీషయల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇక బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం.. కవితను కోర్టులో హాజరుపరుస్తారు.
Read also: Hi Nanna : మరో అరుదైన ఘనత సాధించిన నాని సినిమా..
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
గత విచారణలో చెప్పిన రోస్ అవెన్యూ కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేయడంతో కవితకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న తీర్పులు వెలువడనున్నాయని వెల్లడించారు. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కోర్టులో పోరాడిన కవిత పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నించారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించిన కవిత.. రోస్ అవెన్యూ కోర్టులో హాజరుకాగా, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోరాడుతూనే ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా, సీబీఐ అవినీతి రంగంలోకి దిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ పిడుగు పడినట్లుగా సీబీఐ కూడా రంగంలోకి దిగి కవితను అరెస్ట్ చేసి విచారించింది. సీబీఐ కేసులో కూడా బెయిల్ పొందేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగమే తనపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని కవిత పదే పదే చెబుతున్నారు. మీడియాతో మాట్లాడవద్దని కవితను కోర్టు ఆదేశించన విషయం తెలిసిందే..
Astrology: మే 06, సోమవారం దినఫలాలు
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!