Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు ఆసక్తికరమైన అంచనాలను వెలువరించాయి. ప్రముఖ సర్వే సంస్థలైన చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్పోల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 46 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ 41 శాతంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నా.. వెనుకబడింది. బీజేపీ కేవలం 6 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Jubilee Hills Bypoll : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. పలువురిపై కేసులు నమోదు
మరో సంస్థ స్మార్ట్పోల్ అంచనాలు కూడా దాదాపు అదే ఫలితాన్ని సూచిస్తున్నాయి. స్మార్ట్పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 48.2 శాతం ఓట్లు దక్కవచ్చని అంచనా వేయగా, బీఆర్ఎస్ పార్టీకి 42.1 శాతం ఓట్లు, బీజేపీకి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు సర్వే ఫలితాలు పరిశీలిస్తే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల మొగ్గు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నట్టు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి సుమారు 5 నుండి 6 శాతం ఓట్ల ఆధిక్యం లభించవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓట్ల చీలిక ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
Vladimir Putin: పుతిన్ ఆరోగ్యానికి ఏమైంది.. వైరల్ అవుతున్న వీడియో..
youtube.com/watch?v=1m4y1fUCCPs&feature=youtu.be