Site icon NTV Telugu

JP Nadda Road Show : భాగ్యనగరానికి చేరుకున్న బీజేపీ దళపతి.. రోడ్‌ షో షురూ..

Jp Nadda

Jp Nadda

హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో హాజరుకావడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాజ్యసభ సభ్యులు జాతీయ ఓ బి సి నేత లక్ష్మణ్ , విజయశాంతి ,ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి స్వామి గౌడ్ వివేక్ వెంకటస్వామి ధర్మపురి అరవింద్ ,పొంగులేటి సుధాకర్ రెడ్డి లు ఉన్నారు. అయితే.. వీరితో పాటు జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. శంషాబాద్ ట్రిడెంట్ హాస్పిటల్ నుండి ఇందిరా హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నోవాటెల్‌ హోటల్ కు బయల్దేరారు జేపీ నడ్డా.

Minister KTR : మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ.. ఆవో-దేఖో-సీకో అంటూ..

 

Exit mobile version