Site icon NTV Telugu

Jogu Ramanna : మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం

Jogu Ramanna

Jogu Ramanna

జందాపుర్ నుంచి బోరాజ్ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం బోరాజ్ లో జోగు రామన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారం లోకి వచ్చేది లేదు ఇచ్చేది లేదన్నారు. మోడీ అన్ని వర్గాలను మోసం చేసారని, మెడీ నల్ల చట్టాలు తెచ్చారన్నారు జోగు రామన్న. 4 వందలు ఉన్న గ్యాస్ ధర ను 12 వందలు చేసిన ఘనత మోడీదే అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట తప్పకుండా మేనిఫెస్టోతో పాటు అందులో లేని వాటిని సైతం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని జోగు రామన్న కొనియాడారు. కాంగ్రెస్ వి బట్టేవాజ్ పనులు అని, మహిళలకు కర్ణాటకలో బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని, మగవాళ్ళు మాత్రమే బస్సు ఎక్కాలే అని బోర్డు పెట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలేనని, వేశాలు మార్చి వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ లకు అడ్రస్ ఉండదన్నారు జోగు రామన్న

Also Read : BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రజాభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని, మెనిఫెస్టోలో పెట్టిన హామీల్లో కోటీ 90 లక్షల కుటుంబాలకు ధీమా కల్పించేలా రూ. 5 లక్షల బీమా అందించనున్నట్లు తెలిపారు.సౌభాగ్య మహిళా పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీ సైతం ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిందని గుర్తుచేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు ఆదాయం రెట్టింపు హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఫైర్​ అయ్యారు.

Also Read : RS Praveen Kumar: 10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో.. విడుదల చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్..

Exit mobile version