NTV Telugu Site icon

Kadiyam Srihari: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్, కిషన్రెడ్డి కేంద్ర మంత్రులు అయ్యారు..

Kadiam

Kadiam

Kadiyam Srihari: ఫిబ్రవరిలో 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది.. దానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ, చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని రాష్ట్రాల కలియకతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పటైంది.. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.

Read Also: Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్,కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులు అయ్యారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు చవటలు, దద్దమ్మలంటూ విమర్శించారు. తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చి మీ పలుకుబడి ఏంటో నిరూపించుకోండి అని సవాల్ విసిరారు. లేదంటే తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న మొండి వైఖరికి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దొడ్డి దారిన వచ్చింది.. ఆమెకు ఎలాంటి అనుభవం లేదు అని సెటైర్లు వేశారు. ఈ బీజేపీ పార్టీ మొదటి నుంచి తెలంగాణ, దళిత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందన్నాడు. మతతత్వ పార్టీల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి చెప్పారు.