Site icon NTV Telugu

Suicide: కలకలం.. ప్రిన్సిపాల్ కొట్టాడని విద్యార్థులు ఆత్మహత్యాయత్నం

Suicide

Suicide

Suicide: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మంగళవారం జరిగిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో సార్ కొట్టాడని ఆరోపిస్తూ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. బాధితులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Daggupati Prasad: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సవాల్.. ఒక్క సెంట్ భూమి అయినా చూపించండి..!

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన చరణ్ కుమార్, రామ్ చరణ్ అనే విద్యార్థులు జమ్మికుంటలోని ఎస్వీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అయితే ఒక ఉపాధ్యాయురాలు తమ గురించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో, ప్రిన్సిపాల్ తమని కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ ఆవేశంతో ఇంటికి వెళ్తూ పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాత్రం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Bengaluru: “నీ కోసమే నా భార్యను చంపేశా”.. మహిళలకు డాక్టర్ మెసేజ్..

Exit mobile version