NTV Telugu Site icon

Jairam Ramesh: డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైంది

Jairam Ramesh

Jairam Ramesh

Jairam Ramesh: డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ పాదయాత్ర ద్వారా తమకు తెలిసిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి రాహుల్ పాదయాత్ర బాగా పయోగపడుతుందని, రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలిశారని అన్నారు. వందల దరకాస్తులు వచ్చాయ తెలిపారు. తెలంగాణ ప్రజలు మోడీ.. కేసీఆర్ పాలనతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించారో అందరికీ తెలుసన్నారు.

Read also: Shiv Sena leader shot dead : పంజాబ్‌లో పోలీసుల ఎదుటే శివసేన నేతపై కాల్పులు

కేసీఆర్ కి కౌంట్ డౌన్ మొదలైందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్..కేసీఆర్, మోడీ అని..డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని అన్నారు. బీజేపీపై కొట్లాడుతుంది ఒక కాంగ్రెస్ మాత్రమే అని జైరాం రమేష్‌ అన్నారు. ప్రాంతీయ పార్టీలు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాయని అన్నారు. Mim కూడా బీజేపీ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ.. ఫ్రీడమ్ ఆఫ్టర్ స్పీచ్ లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారు’ అని ఆరోపించారు. హైదరాబాద్ లో 8వ నిజాం ఉన్నాడని ఆరోపించారు. మోడీకి కేసీఆర్ సామంత రాజని జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jogi Ramesh: పవన్‌వి పిచ్చికూతలు.. ఇప్పటంలో వైఎస్ఆర్ విగ్రహం కూడా తొలగించారు