Site icon NTV Telugu

MLC Jeevan Reddy: మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి.. ఏదో ఆయన తెచ్చినట్టు గొప్పలు

Jeevanreddy

Jeevanreddy

MLC Jeevan Reddy: హైదరాబాద్‌ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ కి ..మెట్రో అనేది పెట్టుబడి దారుల కోసం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. బిల్డర్ lnt 90 శాతం.. 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 31 km భారం రాష్ట్ర ప్రభుత్వమే భారం మొస్తుందని అన్నారు. పెట్టుబడి దారుల కోసమే ఏర్పాటు చేస్తూనట్టు ఉంది మెట్రో అంటూ ఎద్దేవ చేశారు. Mgbs నుండి ఫలక్ నుమా నుండి మెట్రో లైన్ వేస్తే km తగ్గుతుందని అన్నారు. ప్రయాణికులకు కూడా వెసులుబాటు వుంటుందని పేర్కొన్నారు జీవన్‌ రెడ్డి. మెట్రో ఏదో కేసీఆర్ తెచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని అన్నారు. పెట్టుబడి దారులు.. రియల్ ఎస్టేట్ వాళ్లకు లాభం చేకూర్చే పనిలో ప్రభుత్వం పడిందని మండిపడ్డారు. రెండో ఫేజ్ లో bhel.. పఠాన్ చేరు వరకు మెట్రో పొడగించాలని డిమాండ్‌ చేశారు. Trs పేరు మార్పు అంటే..trs ని రద్దు చేసుకోవడమే అన్నారు. Trs పెట్టి రాష్ట్రాన్ని దోచారు.. ఇప్పుడు ఇగ దేశం మీద పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క గొప్ప విషయం లేదు.. ఆయన సీఎం కాలేరు..!

కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన రాయితీలు అన్ని కేసీఆర్ నిలిపేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తా అన్న రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతు పై లక్షకు నాలుగు వడ్ల భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదని, రైతు బంధు ..జిందాతిలిస్మాత్ లెక్క చేశారు కేసీఆర్ అని ఎద్దేవ చేశారు. 24 గంటలు కరెంట్ ఎక్కడ ఇస్తున్నావో చూపెట్టూ అంటూ ప్రశ్నించారు. Brs తో తెలంగాణ కి కేసీఆర్ నుండి విముక్తి కలిగిందని అన్నారు. కవిత విషయంలో cbi ఉదాసినతగా వ్యవహారం చేస్తుందని మండిపడ్డారు. అమిత్ అరోరా స్టేట్మెంట్ కి అనుగుణంగా కవితకి నోటీసులు ఇచ్చారని, 41 a కింద నోటీసు ఇవ్వాలని కోరారు. 160 కింద కాదు నోటీసులు ఇవ్వల్సిందే నని అన్నారు. Bl సంతోష్ కి 41a కింద ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి. కవితను సాక్షిగా విచారణ కోసమే తెర మీదకు తెచ్చారని, కవిత సాక్ష్యాలు తారుమారు చేశారని cbi అన్నదని నిప్పులు చెరిగారు. అది కూడా నేరమే కదా? అంటూ ప్రశ్నించారు. సిట్ దూకుడుగా ఉందని, CBI ఉదాసినతగా ఉందని ఆరోపించారు. ఫోన్ లు ధ్వంసం చేశారు అని చెప్పింది కూడా సీబీఐ నే అని అన్నారు. అలాంటప్పుడు 160 crp కింద ఎలా నోటీసులు ఇస్తారు? అని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.
Cyclone Mandous: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న మరబోటు

Exit mobile version