Jagtial Fraud: ఆవ్వా అని పిలిచాడు. అప్యాయంగా ఆమెను పలకరించాడు. నన్ను గుర్తు పట్టావా అని అడిగాడు.. మాటలు కలిపి ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.4 లక్షల రూపాయలు ఉన్నాయని ఫోటో దిగితే.. డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పాడు. ఒంటిపై బంగారం ఉంటే పింఛన్ రాదని చెప్పి ఒట్టి పై ఉన్న బంగారు నగలు తీసి, ఫోటో తీసుకొస్తానని ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘరానా మోసం జగిత్యాల జిల్లాలో జరిగింది..
Read also: Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గంగు(75) అనే వృద్ధురాలు మెడిసిన్ కోసం కోరుట్లకు వచ్చింది. మందులు తీసుకుని ఇంటికి వెళ్ళేందుకు నంది చౌరస్తా వద్ద గల బస్టాఫ్ కు చేరింది. ఒంటరిగా వచ్చిన వృద్ధురాలిని గమనించిన మోసగాడు, ఆ ముసలమ్మతో మాటలు కలిపాడు. అవ్వా బాగున్నావా,నన్ను గుర్తు పడుతున్నావా అని అడిగాడు.నేను మీ ఎమ్మార్వో ను అంటూ పింఛన్ తీసుకున్నావా అని ఆప్యాయంగా మాటలు కలిపాడు. రూ.4 లక్షలు నీ ఖాతాలో జమ అయిందని చెప్పాడు.
Read also: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..
ఎవరికి చెప్పకు, నీ ఒక్కదానికి ఆ డబ్బులు ఇప్పిస్తా, ఒక ఫోటో ఇస్తే సరిపోతుందని ముసలమ్మను బస్టాప్ నుంచి కొద్ది దూరంలోని సంధిలోకి తీసుకెళ్లాడు. పొటో తీయాలి, నీ ఒంటిపై బంగారు నగలు ఉంటే ఫొటోలో అవి కనిపిస్తే పింఛన్ రాదని నమ్మబలికాడు. దీంతో నిజమే కావచ్చని భావించిన వృద్దురాలు మెడలోని రెండు తులాల బంగారు చైన్, చెవి కమ్మ తీసి ఇచ్చింది. అతనితో మరో మహిళా కూడా అక్కడే ఉంది. ఆమెకు ఈ నగలు ఇచ్చి ఫోటో తీసుకొద్దాం పదా అని చెప్పి నగలతో ఉడాయించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఎంతకు రాకపోవడంతో తను మోసపోయానని గ్రహించిన గంగు అనే అవ్వ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Manchu Mohan Babu: మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట