జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలొస్తే ప్రతిసారి గందరగోళం ఉంటుందన్నారు. ఇంకా మనలో పరిణితి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఏ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో పరిణతి ఉందో ఆ దేశాలు ముందుకు పోతున్నాయని అన్నారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది.. అదే మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని చెప్పారు. ఎన్నికలొస్తాయి పోతాయి.. అభ్యర్థి గుణగణాలతో పాటు.. పార్టీ ఎలాంటిదో కూడా చూడాలని కేసీఆర్ అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మీరు కిందమీద చేస్తే.. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని అన్నారు. ఆ పార్టీల నడవడిక, చరిత్ర తెలుసుకోవాలని.. ప్రజల కోసం, రైతుల కోసం ఆయా పార్టీలు ఏం చేసాయో ఆలోచించాలన్నారు. గుడ్డిగా ఓటు వేస్తే చాలా ప్రమాదాలొస్తాయని.. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ముందుకు పోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని.. ఉద్యమ సమయంలో ఇక్కడికి చాలా సార్లు వచ్చానన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది.. గత యాభై ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో అంచనా వేయాలని కేసీఆర్ అన్నారు.
Prakasam: ఒంగోలు భూ కబ్జాల కేసులో 38 మందిని అరెస్ట్
రాష్ట్రం వచ్చిన్నాడు కరెంటు, తాగునీరు, సాగునీరు లేదు. వలసలు ఎక్కువగా ఉండేవని సీఎం కేసీఆర్ తెలిపారు. సిరిసిల్ల, బూదాన్ పోచంపల్లి, దుబ్బాకలాంటి చోట్ల అనేక మంది నేత కార్మికులు చనిపోయేవారన్నారు. ఆ శవాలను పట్టుకుని ఏడ్చి.. అప్పటి సర్కారుకు దండం పెట్టి యాభైవేలు సాయం చేయమంటే చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఆలోచించి పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చామన్నారు. గత ప్రభుత్వాలు తమాషా కోసం 40, 70, 200 ఫించన్లు ఇచ్చేవని.. కానీ బీఆర్ఎస్ సర్కారు వేల రూపాయలకు ఫించన్లు తీసుకుపోయిందని తెలిపారు.
మరోవైపు.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడం లేదని.. దుబ్బాకలో బీడీ కార్మికులు, నేత కార్మికుల కష్టాలు దగ్గర నుంచి చూసానన్నారు. అందుకే ఎవరూ అడగకుండానే బీడీ కార్మికులకు ఫించన్లు అమలు చేసామని తెలిపారు. ఓట్లకోసం ఫించన్లు తేలేదని.. కల్యాణ లక్ష్మి, రైతుబంధులాంటివేవీ ఓట్ల కోసం తేలేదన్నారు. మెనిఫెస్టోలో పెట్టినవి పది అయితే… పెట్టకుండా చేసినవి చాలా ఉన్నాయన్నారు.
Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఫించన్లు క్రమేణా ఐదువేలకు తీసుకుపోతామని సీఎం కేసీఆర్ తెలిపారు. బీడీ కార్మికులున్న ప్రతిచోట ఎమ్మెల్యేలు ఫించన్లు అడుగుతున్నారని చెప్పారు. కోరుట్లలోనూ కొత్తగా నమోదయ్యే బీడీ కార్మికులకు ఫించను ఇస్తామని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రంగులు, రసాయనాలు ఇస్తున్నామని.. అయినా నాకు తృప్తి లేదని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్లో నిధులు పెంచి నేత కార్మికుల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామన్నారు. అలాగే ఇంతకుముందు.. బండాలింగాపూర్ మండలం కావాలని కోరితే చేసామని తెలిపారు. మరోవైపు వరదకాలువలో మోటార్లుపెట్టి నీళ్లు వాడుకునే వీలుండేది కాదని.. ఇప్పుడు వరదకాలువకు మోటార్లు పెట్టకున్నా అడిగే కొడుకెవడన్నా ఉన్నడా అని అన్నారు. ఇదిలా ఉంటే.. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బాగుంటే పల్లెలు బాగుంటాయని ఆలోచించి నీటి తీరువా తీసేసామని.. పాత బకాయిలు రద్దు చేసామన్నారు. అంతేకాకుండా.. ఉల్టా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని అన్నారు. ఎవరికీ దరఖాస్తు పెట్టకున్నా.. మీకు రైతు బంధు నేరుగా ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. రెండుసార్లు రైతు రుణాలుమాఫీ చేసామని.. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది మందికి రుణమాఫీ ఆగిపోయింది. అవి కూడా పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు.
BV Raghavulu: ఎస్పీ, ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి..
ధరణి ఉన్నందువల్లే రైతులకు నేరుగా బ్యాంకులకు డబ్బులు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. దీంతో మళ్లీ దళారులొస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా ఇదే చెబుతున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని.. పైరవీలు, దళారీల రాజ్యం వస్తుందని చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి బేకారు చేస్తున్నాడని, దుబారా చేస్తున్నాడని చెబుతున్నారని తెలిపారు. మీ దయతో మళ్లీ బీఆర్ఎస్ సర్కారు వస్తుంది.. పెరుగుతూ పోయి రైతు బంధు 16వేలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామన్నారు. మూడు గంటలే కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మీకు 24 గంటలు కరెంట్ కావాలా వద్దా అని ప్రశ్నించారు.
24 గంటలు కరెంటు రావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలన్నారు. మంది మాట పట్టుకుని తీర్థం పోతే… నీవు గుళ్లో, నేను దల్లే అన్నట్లే అవుతుందని విమర్శించారు. కేసీఆర్ బతికున్నంత వరకు సెక్యులరిజం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. 12 వేల కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు చేసామని.. రాష్ట్ర తలసరి ఆదాయమే గీటురాయిగా రాష్ట్రం బాగుపడిందా లేదా తెలుస్తుందన్నారు.
మన రాష్ట్రం 3 లక్షల 18 వేల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు.