NTV Telugu Site icon

Jagadish Reddy: ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉంది

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadish Reddy: ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉంది మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. సూర్యాపేట జిల్లా గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పై ఆయన స్పందిస్తూ..
రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా కేంద్రం వాడుకుంటుందని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ కార్యక్రమాలను రాష్ట్రపతి అడ్డుకోనప్పుడు.. రాష్ట్రాలలో గవర్నర్లు అడ్డుకోవడం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. నిర్ణీత వ్యవధిలో బిల్లుల ఆమోదం కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం గవర్నర్ పనికాదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఇతర పార్టీల ప్రభుత్వాల అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Shortest living Dog: ప్రపంచంలోనే అత్యంత పొట్టి కుక్క.. ఎక్కడ ఉందో తెలుసా?

తెలంగాణా మోడల్ అభివృద్ధి దేశమంతా అడుగుతున్నారని అక్కసుతో దుర్మార్గం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ని, తెలంగాణా అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతో కేంద్రం నాటకం ఆడుతుందని నిప్పులు చెరిగారు. శాసన సభ ప్రసంగంలో చెప్పిన అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరు భారత రాజ్యాంగం వ్యవస్థకు మంచిది కాదని మండిపడ్డారు. గవర్నర్ చర్యలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంలా మారుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోడమంటే దేశ అభివృద్ధిని అడ్డకోవడమే అని జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనున్న తరుణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. రెండు బిల్లులను తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే..
Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి