రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుంది: ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు.
తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు ఆ సీడీలు పంపించడంతోపాటు రాష్ట్ర డీజీపీకి సమాచారం ఇస్తామని ఈటల అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో పోలీసుల కనుసన్నల్లోనే డబ్బు పంపకం జరిగిందన్నారు. ప్రజల చెమటతో పన్నులు కడితే జీతాలు తీసుకునే జీతగాళ్ళు మీరు అనే సంగతి అధికార పార్టీ నాయకులు మర్చిపోయారని ఈటల ఎద్దే వా చేశారు. మీరు చేసిన పనికి తెలంగాణ జాతి మొత్తం తలదించు కుంటుందన్నారు. కేసీఆర్ అరిష్ట పాలనను అంతమొందించాలని ప్రజలు చూస్తున్నారన్నారు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
2023లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పాతరేస్తరని ఈటల అన్నారు. ఇక్కడ గెలిచే పార్టీ బీజేపీ అని తెలిపారు. ఆట మొదలైంది రాష్ట్ర మంతట అంటుకుంటుందన్నారు. తెలంగాణలో ఏ వీణ నొక్కిన వచ్చే శబ్దం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దమేనని ఆయన అన్నా రు. దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ ఏడేళ్లలో ఒక్క దళిత కుటుంబమైనా నీవల్ల బాగుపడిందా కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. భారత్ మాతకి జై, బండి సంజయ్, మోడీల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఈటల ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!