NTV Telugu Site icon

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుంది: ఈటల


రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడు తూ.. కేసీఆర్‌ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్‌ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు.

తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు ఆ సీడీలు పంపించడంతోపాటు రాష్ట్ర డీజీపీకి సమాచారం ఇస్తామని ఈటల అన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో పోలీసుల కనుసన్నల్లోనే డబ్బు పంపకం జరిగిందన్నారు. ప్రజల చెమటతో పన్నులు కడితే జీతాలు తీసుకునే జీతగాళ్ళు మీరు అనే సంగతి అధికార పార్టీ నాయకులు మర్చిపోయారని ఈటల ఎద్దే వా చేశారు. మీరు చేసిన పనికి తెలంగాణ జాతి మొత్తం తలదించు కుంటుందన్నారు. కేసీఆర్ అరిష్ట పాలనను అంతమొందించాలని ప్రజలు చూస్తున్నారన్నారు.

2023లో టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు పాతరేస్తరని ఈటల అన్నారు. ఇక్కడ గెలిచే పార్టీ బీజేపీ అని తెలిపారు. ఆట మొదలైంది రాష్ట్ర మంతట అంటుకుంటుందన్నారు. తెలంగాణలో ఏ వీణ నొక్కిన వచ్చే శబ్దం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దమేనని ఆయన అన్నా రు. దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ఈ ఏడేళ్లలో ఒక్క దళిత కుటుంబమైనా నీవల్ల బాగుపడిందా కేసీఆర్‌ అంటూ ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పై ఫైర్‌ అయ్యారు. భారత్ మాతకి జై, బండి సంజయ్, మోడీల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఈటల ప్రసంగాన్ని ముగించారు.