Malla Reddy IT Raids: నేడు మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Officials Questioning Second Day On Malla Reddy Assets: ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదన్న ఆరోపణలతో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే! రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ తొలిరోజు విచారణ ముగియగా.. నేడు రెండో రోజు విచారణ కొనసాగనుంది. మొదటిరోజు ఐటీ కార్యాలయంలో 12 మందిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణకు మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ ఇద్దరిని అధికారులు ఎక్కువ సమయం విచారించారు.
మరోవైపు.. మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీలకు చెందిన ఆదాయ పన్ను వ్యత్యాసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా.. వంద కోట్ల రూపాయల్ని అధికంగా కాలేజీ డొనేషన్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మొదటి రోజు మెడికల్ కాలేజీలకు చెందిన డాక్యుమెంట్లతో విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్లు, అకౌంటెట్లు, ఆడిటర్లు.. రెండో రోజు విచారణకూ హాజరు కానున్నారు. అయితే.. ఈరోజు విచారణకు మల్లారెడ్డి తరపున ఆడిటర్లు హాజరు కానున్నారు. ఇక వీరితో పాటు కొత్తగా సమన్లు అందుకున్న పదిమందితో పాటు మరికొందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. నేడు విచారణలో భాగంగా.. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సిబ్బంది, అకౌంటెంట్లను ఐటీ శాఖ ప్రశ్నించనుంది. తొలిరోజు విచారణలో పలువురికి ఐటి ఫార్మాట్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించిన ఐటీ అధికారులు.. నేడు బ్యాంక్ ఖాతాలపై విచారించనున్నారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
కాగా.. తొలిరోజు ఐటీ అధికారులు ఐదు గంటల పాటు విచారణ సాగించారు. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!