NTV Telugu Site icon

Suspicious Death: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Vamshika

Vamshika

Suspicious Death: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే 16 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నారాయణ కాలేజీలో చేరింది. అయితే వంశిత ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంశిత రూమ్ మెంట్స్ తనను వెతుక్కుంటూ రావడంతో బిల్డింగ్ వద్ద శవమై కనిపించింది. దీంతో భాయాందోళన చెందిన కళాశాల విద్యార్థినులు అక్కడే ఉన్న వార్డెన్లు, ఉపాధ్యాయులకు తెలిపారు. కాగా విషయం తెసుకున్న కళాశాల యాజమాన్యం హుటూహుటిన వచ్చి చూడగా నిర్ఘాంతపోయారు. వంశిత మృతిపై వెంటనే బాచుపల్లి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. వంశిత భవనంపై నుంచి దూకిందా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యా..? వారం రోజుల క్రితం కాలేజీలో చేరిన వంశీతకు అక్కడి వాతావరణం నచ్చలేదా..? లేక చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయిందా..? అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్

గాంధీ మార్చురీకి వంశిక కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దుబాయిలో ఉంటున్న వంశిక తండ్రి శాంతారావు, మార్చురీ వద్దకు తల్లి సుమలత ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. సుమలత, శాంతారావు దంపతులకు ఇద్దరు పిల్లలు బాబు, పాప ఉన్నారు. వంశిక పెద్దమ్మాయి. వంశిక చనిపోయిందన్న విషయం మాకు గాంధీ హాస్పిటల్ కి వచ్చే అంతవరకు కూడా తెలియదని వాపోయారు. కనీసం కాలేజీ వాళ్ళు వంశిక చనిపోయింది అన్న విషయాన్ని కూడా మాకు చెప్పలేదని ఆరోపించారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చి తెలుసుకొని ఆ తర్వాత మార్చురీ వద్దకు వస్తే అప్పుడు మాకు తెలిసింది వంశిక చనిపోయిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంశిక బాగా చదువుతుంది, టెన్త్ క్లాసులో 9.5% మార్కుల వచ్చాయని తెలిపారు. ఆమెకు హాస్టల్లో ఉండడం ఇష్టమే, అందుకే చేర్పించామని అన్నారు. ఆదివారం మాతో మాట్లాడింది, హాస్టల్ అంతా బానే ఉందని చెప్పిందని వంశిక తల్లి దండ్రులు తెలిపారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియదని, తన బిడ్డ ఇలా శవంలా మాకు అప్పగిస్తారని ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. వంశిక మృతికి కారకులైన వారిని కఠిణంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి