Indian Racing League: ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. దేశంలో తొలి స్ర్టీట్ సర్క్యూట్ రేసుకు మన మహానగరం సిద్ధమైంది. నేడు రేపు హుస్సేన్ సాగర్ లేక్‌లో భారతదేశానికి చెందిన స్ట్రీట్ సర్క్యూట్ రేసుల ప్రారంభ ఎడిషన్ ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ మొదటి రేసును హైదరాబాద్ నగరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. నేడు ఇండియన్ రేసింగ్ రన్ లీగ్ ప్రారంభం కానుంది. దీంతో దీన్ని చూసేందుకు ప్రజల్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నేడు, రేపు ఐటీ కంపెనీలకు సెలవు దినం కావడంతో నేడు ఇండియన్ రేసింగ్ రన్ లీగ్ ను చూసేందుకు సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఇవాళ ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు రేసింగ్ లీగ్‌పై బ్రీఫింగ్ ఉంటుంది. అనంతరం ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు ఇండియన్ రేసింగ్ లీగ్-ఎఫ్‌పీ1, ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎఫ్‌పీ2, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల వరకు రేసింగ్(క్వాలిఫైంగ్), సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు రేసింగ్-రేస్1, 4.45 నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే 20వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్‌పీ3, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 1.15 వరకు క్వాలిఫైంగ్ లీగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు లీగ్ రేస్2 ఉంటుంది. సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రేస్3, అలాగే సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి.
Read also: Fifa World Cup: యుద్ధ విమానాలతో ఖతార్ చేరుకున్న పోలెండ్ జట్టు.. కారణం ఏంటంటే..?
ఈలీగ్‌లో నగరంలో బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు బరిలో నిలిచాయి. ప్రతిజట్టుకు నలుగురు చొప్పున ఇండియా.. ఫారిన్‌కు చెందిన మొత్తం 24 మంది రేసర్లు పోటీ పడతారు. అయితే.. గంటకు దాదాపు 240 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తారు. దీనికోసం లుంబినీ పార్క్, హుస్సేన్‌సాగర్, ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీయార్ మార్గ్ గుండా తిరిగి లుంబినీ పార్క్ మీదుగా 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేయగా.. ఇందులో 17 మలుపులు ఉన్నాయి. ఇక, ప్రత్యేక ట్రాక్ చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి ఫ్యాన్స్ పోటీలు చూడొచ్చు. వీళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై 1,100 సీసీ సామర్థ్యంతో కూడిన ఫార్ములా–3 లెవెల్ కార్లలో 240 కి.మీ వేగం వరకు దూసుకెళ్లనున్నారు. అయితే.. దేశంలో ఇదే మొదటి స్ట్రీట్ సర్క్యూట్ లీగ్ కావడం విశేషం.
Tiger Search in Adilabad: పులి కోసం వేట.. 30 కెమెరాల ఏర్పాటు
