Telangana Weather: తెలంగాణలో చలి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలతో చలి తగ్గినప్పటికీ తాజాగా పెరుగుతోంది. రాత్రి కాకుండా పగలు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉంది.
Read also: CM Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సింగిల్ డిజిట్ కు గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా బేల లో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో 10.4 డిగ్రీలు నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబీలో 11 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లా భిమినిలో 14.8గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం కూడా చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా డిసెంబర్ మరియు జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
Read also: Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ
రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Top Headlines@9AM: టాప్ న్యూస్