Telangana Weather: తెలంగాణలో చలి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలతో చలి తగ్గినప్పటికీ తాజాగా పెరుగుతోంది. రాత్రి కాకుండా పగలు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
తుపాను ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలిగాలులు గత మూడు రోజుల నుంచి గణనీయంగా పెరగాయి. మంగళ, బుధ,గురువారాలతో పోలిస్తే శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.