Sub Registrars Corruption: ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల చేతివాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారా? డాక్యుమెంట్ కదలాలంటే కాసులు ముట్టజెప్పాల్సిందేనా? కొర్రీలు పెట్టి మరీ డబ్బులు దండుకున్నది ఎవరు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్ఛార్జ్ ల పాలన ఇంకెన్నాళ్ళు. డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? వివిధ పార్టీల నాయకులు వారికే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల తీరు విమర్శల పాలవుతోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇంచార్జ్ ల చేతుల్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ ,మంచిర్యాల ,లక్షెట్టిపేట,నిర్మల్ ,ఆదిలాబాద్ ,బోథ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. ఒక రెండు చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నప్పటికి వారు లీవ్ లో వెళ్ళిపోవడంతో అక్కడ ఇన్ఛార్జ్ ల పాలన కొనసాగడం అక్రమాలకు తావిస్తోంది. అర్హతలేని, సీనియార్టీ లేని వారికి సైతం బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేక ఇద్దరు ఇన్ఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు.అయితే వీరు అక్రమాలు చేస్తున్నారని డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతున్న వారంతా ఏకంగా నిరసనలకు దిగుతున్నారు. వాళ్ళు చేపట్టిన నిరసన దీక్షలకు ప్రతిపక్ష నాయకులు మద్దతు పలుకుతున్నారు.
Also Read
రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ను నియమించాలని ఏకంగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయం వద్ద సైతం ధర్నా చేపట్టారు..అలాగే స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న వారు అక్రమాలు చేస్తున్నారని వీరంతా ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ఇలా ఉంటే డాక్యుమెంట్ రైటర్ల విధానం లేదు..రియల్ వ్యాపారులకు ,సబ్ రిజిస్టార్లకు మధ్య బ్రోకర్లుగా ఉండే వీరంతా ఇప్పుడు వ్యవస్థనే శాసించే స్థాయికి వెళ్ళారు. అందుకే వారికే అందరు మద్దతు తెలుపుతున్నారని వారి ఆందోళనలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు ఏం సంబంధం అంటున్నారు అధికారులు. అసలు వాళ్లకేం అర్హత ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులంటున్నారు. వాళ్లు ధర్నాలు చేస్తే సంబంధం లేదంటున్నారు.
ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న వారంతా ధర్నాల పేరు చెప్పి ఇళ్ళల్లో డాక్యుమెంట్లు కొట్టి ఇస్తూ కొంతమంది వేలాది రూపాయలు అదనంగా దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల అర్హత ఉన్న వాళ్లుగాని అసలు ఆవ్యవస్థే తొలగించబడిందని క్రయవిక్రయ దారులు ఎవ్వరి వద్దకు వెళ్ళకుండా నేరుగా వస్తే తామే రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. రైటర్ల వ్యవస్థ లేనప్పుడు రాజకీయ నాయకులు సైతం వారికెలా మద్దతు పలుకుతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్న మౌతున్నాయి. ఏది ఏమైనా బ్రోకర్ వ్యవస్థ లేకుండా ,క్రయవిక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
Wedding: జొమాటో నిర్లక్ష్యం.. మటన్ బిర్యానీ లేదని పెళ్లి వాయిదా..!!
తాజావార్తలు
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..