Site icon NTV Telugu

Bandi Sanjay: ఫైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ ను పట్టించుకోను..

Rohith Reddy Bandi Sanjay

Rohith Reddy Bandi Sanjay

Bandi Sanjay: ఫైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ పై బండి సంజయ్‌ స్పందిచారు. రోహిత్‌ రెడ్డి సవాల్‌ను పట్టించుకోను అన్నారు. ఎవరికి పడితే వారికి స్పందించను అంటూ కొట్టిపడేశారు బండిసంజయ్. అనంతరం మోడీ పై పాకిస్తాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహం నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. నిరసన ప్రదర్శనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రధాని పై ఇష్టను సారంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రపంచం గొప్ప నాయుకుడిగా మోడీ ని అందరూ చూస్తున్నారని తెలిపారు. పాకిస్థాన్ కి గుణపాఠం చెప్పాలని, పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదుల దేశమన్నారు.

Read also: Monkey Attack: కోతుల దాడి… కాళ్లు విరిగి యువకుడికి అవస్థలు

టెర్రరిస్టులకు స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నాయని తెలిపారు. నరేంద్రమోదీ టెర్రరిస్ట్ కాదు.. గుజరాత్ అల్లర్లలో మోడీని అమెరికా రాకుండా చేస్తే, సుప్రీంకోర్టు తీర్పు తరువాత రెడ్ కార్పెట్ తో ఆమెరికా స్వాగతం పలికిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ మన దేశంలో విమర్శలు చేస్తే ప్రతి భారతీయుడు స్పదించాలన్నారు. సర్జికల్ స్ట్రైక్ రావొద్దు అంటే పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. G20 సదస్సుకు ఆథిద్యం ఇస్తున్న దేశం భారత దేశమని బండి సంజయ్‌ తెలిపారు. బిలావర్ బుట్టో తల్లిని పొట్టనపెట్టుకున్నారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ లు అన్నారు. అలాంటి దేశంలో నీవున్నావు గుర్తుంచుకో అన్నారు బండి సంజయ్‌. నీవు ఐఎస్ఐ నీడన ఉన్న సంగతి మరచిపోకు అంటూ హెచ్చారించారు.
China Covid: చైనాలో కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు

Exit mobile version