NTV Telugu Site icon

CM Revanth: కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..

Revanth

Revanth

CM Revanth: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేయడమే నా బాధ్యత అన్నారు. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది.. పార్లమెంటు ఎన్నికల్లో మంచి పని తీరు కనబరిచాం.. అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also: Hyderabad: చాయ్ పెట్టనందుకు కోడలును చంపేసిన అత్తా..

ఇక, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వచ్చిన చోట మేము గెలిచాం.. బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచింది అని రేవంత్ రెడ్డి అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు నేను పాల్పడను అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను గద్దె దింపాలన్న నా జీవిత లక్ష్యం నెరవేరింది.. ముఖ్యమంత్రిగా నా రెండో కల నెరవేరింది.. బీఆర్ఎస్ ను లోక్ సభలో జీరో చేశా.. ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరింది.. ఇక, తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.