HYDRA : హైదరాబాద్ నగరంలోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని సాయి సారధి నగర్‌లో ఉన్న decades-old పార్కు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (HYDRAA) ఆదివారం కూల్చివేసింది. వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ప్రజావాణి ఫిర్యాదు ఆధారంగా, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు నిర్వహించిన విచారణలో 1961లో రూపుదిద్దుకున్న 35 ప్లాట్ల లేఔట్‌లోని 1533 గజాల స్థలం పార్కుగా కేటాయించబడినదని నిర్ధారణ అయ్యింది. అయితే నారాయణ ప్రసాద్ వారసులు ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మించి, ఇంటి నంబర్ కూడా పొందినట్టు స్థానికులు తెలిపారు.
ENERepeat : టీమ్ కన్యారాశి మళ్ళి వస్తోంది.. ఈ నగరానికి ఏమైంది – 2 స్టార్ట్
జీహెచ్ఎంసీకి అప్పట్లో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ, పార్కు స్థలాన్ని ఖాళీ చేయించలేకపోయారు. చివరికి నివాసితులు హైడ్రా శరణు వెళ్లి, వాటి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో వివిధ శాఖల సహకారంతో విచారణ జరిపి ఆక్రమణలు తొలగించబడినాయి. ఇప్పుడు ఆ భూమిపై “Protected by HYDRAA” బోర్డు పెట్టడంతో, దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటానికి ముగింపు లభించినట్టైంది. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, “ఇది 60 ఏళ్ల శ్రమ ఫలితం” అని హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి ద్వారా చేసిన ఫిర్యాదు తక్షణమే స్పందించి పరిష్కరించడంపై ఆ ప్రాంత వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar : ప్రతిపక్ష బాధ్యత మరిచి రాష్ట్రానికి నష్టం చేస్తోంది బీఆర్ఎస్
