AV Ranganath : హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ పనితీరు, భవిష్యత్ దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ .. “హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు. ఇది కొత్త ప్రోగ్రామ్, కాబట్టి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ, మేము భాగానే పనులు చేస్తున్నాం. తప్పులు జరిగితే వాటిని సమీక్షించుకుంటాం” అన్నారు.
హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే జిహెచ్ఎంసి యాక్ట్‌లో మార్పులు చేసి సంబంధిత అధికారాలు కల్పించిందని కమిషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు.
Etela Rajender : నిజమైన పేదవాడు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
వరదల్లో మురుగు నీరు సమస్యలను పరిష్కరించడం, అకాల వర్షాల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణ, చెరువులు–నాలాలను రక్షించడం హైడ్రా ప్రధాన లక్ష్యమని కమిషనర్ చెప్పారు. “నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులు చేశాం. సిబ్బంది చేతనే మ్యాన్‌హోల్స్, నాలాలు క్లీన్ చేయించాం. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని ఫోర్కాస్ట్ ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడే చేస్తున్న పనులు వచ్చే 100 ఏళ్లకు ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు. “60–65 శాతం చెరువులు మాయం అయ్యాయి. పొల్యూషన్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. వాటిని అడ్డుకోవాలి. CSR పేరుతో చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకోం. చెరువుల మాదిరిగా నాలాలను కూడా నోటిఫై చేసి కబ్జాలను నిరోధిస్తాం” అని హెచ్చరించారు.
అలాగే, బతుకమ్మ కుంట, కూకట్పల్లి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత స్థానికులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైడ్రా ఏర్పడి సంవత్సరం పూర్తయిందని, ఈ కాలంలో అనేక కార్యక్రమాలు అమలు చేశామని కమిషనర్ తెలిపారు. “తక్కువ మ్యాన్‌పవర్‌తో ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించాం. ఇప్పటి వరకు 500 ఎకరాలను కాపాడగలిగాము” అని గర్వంగా చెప్పారు.
