NTV Telugu Site icon

Nehru Zoological Park: సరికొత్త రికార్డ్‌.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్‌

Nehru Zoological Park

Nehru Zoological Park

Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్‌ వెదర్‌.. అందులోనూ వీకెండ్‌.. ఇంకేముందు బెస్ట్‌ హాలీడే స్పాట్‌గా నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ ఫస్ట్‌ ప్లేస్‌కి వచ్చేసింది. ఇక.. ఇప్పుడు వెదర్‌ మారిపోవడంతో బయటకొచ్చి చిల్‌ అవుతున్నారు… ఆదివారం సెలవు దినం కావడంతో బెస్ట్‌ హాలీడే స్పాట్‌ను ఫిక్స్‌ చేసుకుంటున్నారు. కాగా.. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌కు రద్దీ పెరిగింది. అందరూ.. ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబ సమేతంగా జూకు క్యూ కడుతున్నారు. ఇక.. పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. కాగా.. మరికొందరైతే చెట్ల కిందే కార్పెట్లు వేసుకొని మధ్యాహ్నం అక్కడే ఓ కునుకు తీస్తున్నారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మునుపెన్నడూ లేని విధంగా రష్‌ నెహ్రూ జూపార్క్‌లో కనిపిస్తోంది. ఇక.. ఎంట్రీ టికెట్‌ కోసం క్యూ లైన్‌లో వెయిట్‌ చేయాల్సిన పరిస్థితొచ్చింది.

Read also: Chhattisgarh : పేలుడు జరిగి 36 గంటలు గడిచినా.. లభించని ఎనిమిది మంది కూలీల ఆచూకీ

కాగా.. సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 8 వేల మందికిపైగా వచ్చే నెహ్రూ జూపార్క్‌కు ఆదివారం ఒక్కరోజే 30వేల మంది రావడం సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఇక్కడ.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా.. విదేశీలు సంఖ్య గట్టిగానే ఉంది. ఇక్కడ.. ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌, బర్త్‌డే ఫోటో షూట్స్‌ కోసం కూడా జూ పార్క్‌నే ప్రధాన స్పాట్‎లుగా ఎంచుకోవడం కూడా భారీ రద్దీకి కారణంగా కనిపిస్తోంది. దీంతో.. సందర్శకుల రద్దీ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది సిబ్బంది. పార్క్ కు సందర్శకుల తాకిడి గట్టిగా ఉండటంతో టికెట్‌ కౌంటర్ల సంఖ్య పెంచారు. దీంతో.. కౌంటర్ల దగ్గర ఎండ తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. మంచినీళ్లను సైతం అందిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా.. ఇలాంటి రద్దీని మునుపెన్నడూ చూడలేదంటున్నారు జూ పార్క్‌ సిబ్బంది. అయితే.. ఈ వారం రోజుల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌పార్టీ.. నేడు 86 మందిని విచారించనున్న పోలీసులు!

Show comments