Hyderabad: హోటల్లో వెంటపడిన కుక్క.. మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
- చందానగర్ లో కుక్క తరమడంతో మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
- చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్లో ఘటన..
- సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. విచారణ చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. హోటల్లో కుక్క వెంట పడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్‌కు అతడు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంట పడటంతో.. దాని నుండి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు ఉదయ్.
Read Also: Haripriya Naik: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు..
Also Read
ఇక, ఉదయ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్ కు అతడి స్నేహితులు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు పోలీసులు. అసలు హోటల్ మూడవ అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది అనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!