Site icon NTV Telugu

Hyderabad: ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. ట్విస్ట్ ఏంటంటే..?

Hyd

Hyd

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన యువకుడుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన రాము అనే యువకుడు డ్యాన్సర్ గా పని చేస్తున్నాడు. ఇక, అతడికి రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో జూబ్లీహిల్స్ పరిధిలోని కృష్ణ నగర్ కి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.

Read Also: Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్‌ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!

అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారి పలుమార్లు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని రాము అనే యువకుడు నమ్మించి ఫిజికల్ గా కలిశారు. దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుందామని ఆ యువతి చాలా సార్లు అడగ్గా.. అతడు తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు 2025 జనవరి 28వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టగా గురువారం నాడు మధ్యాహ్నం డ్యాన్సర్ రాముని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Exit mobile version