KTR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ బూత్ స్థాయి సమావేశం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం నాడే ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది.. అయినా గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
అయితే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బూల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు.. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది, రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు.. హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది, పెద్దల ఇళ్లకు వెళ్లదు అని మండిపడ్డారు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ లాంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైనా ఇళ్లు కట్టినా కూల్చివేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది.. 8 ఏళ్లు GST తెచ్చి రక్తం తాగి, ఇప్పుడు కొంత జీఎస్టీ తగ్గించి ఇంటింట పండగ చేసుకోండి అని మోడీ అంటున్నాడు.. GST పేరుతో మా పైసలు మాకు ఇస్తే పండగ చేసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Telangana Govt: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా.. ఒక్కో కార్మికుడికి లక్షల్లో బోనస్
ఇక, కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గిస్తే పండగ చేసుకుంటామని కేటీఆర్ సూచించారు. ముడి చమురు ధరలు తగ్గుతుంటే , మోడీ చమురు మాత్రం తగ్గడం లేదు.. మతం పేరుతో మంట పెట్టీ చలి కాగేవారు బీజేపీ నాయకులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది.. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలి అని చెప్పుకొచ్చారు. మోసాన్న మోసంతోనే జయించాలి అని వెల్లడించారు.
