Site icon NTV Telugu

Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..

Ice Creemm

Ice Creemm

Whiskey Ice Cream: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఐస్‌క్రీమ్‌ను విస్కీలో కలిపి పిల్లలకు విక్రయిస్తారు. జూబ్లీహిల్స్‌ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు. అయితే అధికారులకు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 100 ఎంఎల్‌ విస్కీతో కలిపి 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారులు, యువకులు ఈ ఐస్ క్రీమ్ లను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్న అరికో పార్లల్ సంస్థ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఎన్ని పార్లర్లు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లులు తినే తిండిపై దుర్మార్గులు ఇలా చేస్తే పిల్లల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version