తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిరుద్యోగ దీక్ష అంటూ బీజేపీ చీప్ బండి సంజయ్ దీక్ష చేపడుతుంటే.. రచ్చబండ అంటూ కాంగ్రెస్ ఓ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌ను తుక్కుతుక్కు ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దేవరకొండ ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకొని పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ ఎక్కడ..? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి ఆరోపించారు.
