Site icon NTV Telugu

Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చ..!

Babu

Babu

Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( ఆదివారం ) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చిన ఆయన.. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈరోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు.

Read Also: RAM : హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?

అయితే, ఇటీవల ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పర్యటించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగుర వేస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేతల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100 శాతం వెనక్కి ఏపీ ఉందన్నారు. నరేంద్ర మోడీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

Exit mobile version