NTV Telugu Site icon

TPCC Chief: నేడు ఢిల్లీకి టీపీసీసీ కొత్త అధ్యక్షుడు.. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ..!

Mahesh

Mahesh

TPCC Chief: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. దాంతో పాటు ఈ నెల 15వ తేదీన జరగనున్న తన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానించబోతున్నారు ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలను కలిసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గీలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. టీపీసీసీ నూతన అధ్యక్షునిగా నియమితుడైన ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌ను మంగళవారం పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు. వారిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే విజయరమణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే, మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని మంత్రి దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయంలో ఆయనను మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Also: Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..

ఇక, ఈనెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఏఐసీసీ అధిష్టానంతో జరపనున్న చర్చల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ సభ్యుల ఎంపిక లాంటి విషయాలపై ఏఐసీసీ అగ్ర నేతలు, రాష్ట్ర నేతలతో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరపనున్నారు.

Show comments