Tomato and Onion Prices: కిచెన్‌కు రానంటున్న టమోటా..! కోయకుండానే కన్నీరుపెట్టిస్తున్న ఉల్లిగడ్డ..
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..
- రిటైల్ మార్కెట్లో 100 దాటిన కిలో టమాటా..
- మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా రాని టమాటా..
- ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న టమాటా పంట.. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato and Onion Prices: ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లు తెలుస్తోంది. డిమాండ్‌కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు కూరగాయల వ్యాపారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని.. దీంతో ధరలు అమాంతం పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. హైదరాబాద్‌కు తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా టమాటా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి పంట రాక తగ్గడంతో పాటు..రాష్ట్రంలో దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా ధర వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధర తక్కువగా ఉండాలి.
Read Also: Shruti Hassan : అడవి శేషుకు హ్యాండిచ్చిన శృతిహాసన్.. డెకాయిట్ నుంచి అవుట్
Also Read
భారీ వర్షాలతో దిగుబడి తగ్గి ధర పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ధరలు మరో నెల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగింది. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. ఐతే సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్‌ను రిలీజ్ చేసింది. అలాగే నాఫెడ్ ద్వారా 35 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. ఇక, వెల్లుల్లి ధర కూడా భారీగానే పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 500 పలుకుతోంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో 300లకు పెరిగింది. కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. గుడ్డు ఒక్కొటి 6 రూపాయలు పలుకుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా వంట నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!