ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లు తెలుస్తోంది.