Site icon NTV Telugu

Tomato and Onion Prices: కిచెన్‌కు రానంటున్న టమోటా..! కోయకుండానే కన్నీరుపెట్టిస్తున్న ఉల్లిగడ్డ..

Tomato And Onion

Tomato And Onion

Tomato and Onion Prices: ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లు తెలుస్తోంది. డిమాండ్‌కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు కూరగాయల వ్యాపారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని.. దీంతో ధరలు అమాంతం పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. హైదరాబాద్‌కు తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా టమాటా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి పంట రాక తగ్గడంతో పాటు..రాష్ట్రంలో దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా ధర వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధర తక్కువగా ఉండాలి.

Read Also: Shruti Hassan : అడవి శేషుకు హ్యాండిచ్చిన శృతిహాసన్.. డెకాయిట్ నుంచి అవుట్

భారీ వర్షాలతో దిగుబడి తగ్గి ధర పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ధరలు మరో నెల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగింది. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. ఐతే సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్‌ను రిలీజ్ చేసింది. అలాగే నాఫెడ్ ద్వారా 35 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. ఇక, వెల్లుల్లి ధర కూడా భారీగానే పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 500 పలుకుతోంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో 300లకు పెరిగింది. కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. గుడ్డు ఒక్కొటి 6 రూపాయలు పలుకుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా వంట నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version