NTV Telugu Site icon

Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..

Ganesh Immersion

Ganesh Immersion

Ganesh Immersion: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణనాథుల నిమజ్జనం రెండోరోజు కొనసాగుతుంది. ఎన్టీఆర్‌ మార్గ్, పీవీ మార్గ్‌లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. హుస్సేన్‌సాగర్‌ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలివస్తున్నాయి. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లోపై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. రాత్రి ఒంటిగంటకు చార్మినార్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. బుధవారం సాయంత్రంకల్లా నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేష్ మండపాల నుంచి తమ వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు..
Astrology: సెప్టెంబర్ 18, బుధవారం దినఫలాలు

Show comments