TG DSC Hall Tickets: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల..
- తెలంగాణ DSC పరీక్ష అభ్యర్థులకు హెచ్చరిక..
- ఈరోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి..
- ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG DSC Hall Tickets: తెలంగాణ DSC రాసే అభ్యర్థులకు అలర్ట్. ఈరోజు సాయంత్రం నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. డీఎస్సీ హాల్ టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనుంది. సీబీటీ ఆధారిత పరీక్షను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలు సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
Read also: Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇదీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్.
* మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జూలై 18న
* జూలై 18న రెండవ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
* జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 20న SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
* జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
* జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయోలాజికల్ సైన్స్ పరీక్ష
* జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే విద్యాశాఖను సీజ్ చేసి మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు తమ వ్యాపారం కోసం పరీక్షలను వాయిదా వేయాలని తనను సంప్రదించారని తెలిపారు. విద్యార్థుల మృతితో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Pakistan : తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని మహిళ ముక్కు కోసిన కిరాతకుడు
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..