Gandhi Bhavan: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తల మధ్య కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Read also: Kamareddy School Bus: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ.. బస్సులో 50 మంది స్టూడెంట్స్..
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు యత్నించడంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఈ క్రమంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..