Telangana Rising Global Summit Day 2: తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రెండో రోజు రూ.2.96 లక్షల కోట్లకు ఎంవోయూలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit Day 2: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది.. బ్యాక్‌టు బ్యాక్ మీటింగ్‌లు, వరుసగా మౌ సంతకాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో రూ.5,39,495 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.. తొలి రోజు రూ.2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా.. 2వ రోజు.. పెట్టుబడులు మరింత పెరిగాయి.. రూ.2 లక్షల 96 వేల 495 కోట్ల పెట్టుబడులు రెండో రోజు వచ్చాయి…. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు.. ప్రాజెక్టులు, ఉద్యోగాలు పరిశీలిస్తే..
Also Read
- Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
- Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
* గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్
రూ. 150 కోట్లు పెట్టుబడి
40 ఎకరాలు భూమి అవసరం
రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో డెయిరీ యూనిట్ విస్తరణ
300 ప్రత్యక్ష ఉద్యోగాలు
* ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఫుడ్ & అగ్రికల్చర్‌కు అత్యాధునిక R&D సెంటర్
అరుదైన చక్కెరల తయారీకి గ్రీన్‌ఫీల్డ్ యూనిట్
మొత్తం పెట్టుబడి రూ.2,000 కోట్లు
దశ 1 – రూ.500 కోట్లు
దశ 2 – రూ.1,500 కోట్లు
100 ఎకరాల భూమి
800+ ఉద్యోగాలు
అదనంగా సుస్థిర వ్యవసాయానికి రూ.200 కోట్ల ప్రాజెక్ట్
* KJS ఇండియా
ఫుడ్ & బేవరేజెస్ తయారీ యూనిట్-2 విస్తరణ
రూ. 650 కోట్లు
44 ఎకరాలు
1,551 ఉద్యోగాలు
నెస్లే, యూనిలీవర్ వంటి గ్లోబల్ బ్రాండ్లకు కాంట్రాక్ట్ తయారీ
* ఓల్డ్‌టైమ్ కాఫీ అండ్ లిమిటెడ్ బేవరేజెస్
ఎగుమతి-ఆధారిత ప్రీమియం ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్
రూ. 1,100 కోట్లు
15 ఎకరాలు
1,000 ఉద్యోగాలు
* రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL)
పానీయాలు, స్నాక్స్, మిఠాయిలు, FMCG ఉత్పత్తుల తయారీ ప్లాంట్
రూ. 1,500 కోట్లు
100 ఎకరాలు
1,000 ఉద్యోగాలు
* కేన్స్ టెక్నాలజీ ఇండియా
ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ విస్తరణ
పెట్టుబడి: రూ.1,000 కోట్లు
* JCK ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్
డేటా సెంటర్ & మౌలిక సదుపాయాలు
పెట్టుబడి రూ.9,000 కోట్లు
2,000 ఉద్యోగాలు
* RCT ఎర్నర్జీ ఇండియా
మూడు దశల్లో రూ.2,500 కోట్లు పెట్టుబడి
1,600+ ఉద్యోగాలు
* Aqylon Nexus Ltd
క్లిన్ ఎనర్జీ ఆధారిత 50MW డేటా సెంటర్
Telangana Net Zero Data Center Hub లక్ష్యం
AI ఆధారిత IoT సొల్యూషన్లు కూడా
* AGP గ్రూప్
125 ఎకరాల్లో 1GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్
BESS స్టోరేజ్ యూనిట్
మొత్తం పెట్టుబడి: రూ.6,750 కోట్లు
* InfraKey DC Parks
1GW స్కేలబుల్ డేటా పార్క్
150 ఎకరాలు
మొత్తం పెట్టుబడి రూ.70,000 కోట్లు
ఫ్యూచర్-రెడీ కూలింగ్ ఇన్‌ఫ్రా
* పరిధి గ్రూప్
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) + AI హైపర్‌స్కేల్ డేటా సెంటర్
తొలి దశలోనే 3,000 ఉద్యోగాలు
8–10 ఎకరాల్లో 50MW డేటా సెంటర్
* హెటెరో గ్రూప్
భారీ ఫార్మా ఫార్ములేషన్ యూనిట్
పెట్టుబడి: రూ.1,800 కోట్లు
భూమి: 100 ఎకరాలు
9,000+ ఉద్యోగాలు
* భారత్ బయోటెక్
స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ CRDMO సౌకర్యం
పెట్టుబడి రూ.1,000 కోట్లు
200+ ఉద్యోగాలు
* అరబిందో ఫార్మా
కాంప్లెక్స్ జెనరిక్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ విస్తరణ
పెట్టుబడి రూ.2,000 కోట్లు
3,000 ఉద్యోగాలు
* గ్రాన్యూల్స్ ఇండియా
ఆంకాలజీ CDMO & పెప్టైడ్ మాన్యుఫ్యాక్చరింగ్
పెట్టుబడి రూ.1,200 కోట్లు
100 ఎకరాలు
2,500–3,000 ఉద్యోగాలు
* జివా & లిమిటెడ్
భారీ వ్యాక్సిన్ & R&D యూనిట్లు
పెట్టుబడి: రూ.3,500 కోట్లు (మొత్తం 4,000 కోట్లు)
150 ఎకరాలు
3,000 ఉద్యోగాలు
మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పరిశ్రమల విభాగానికే కాదు, పౌరులకు, ఉద్యోగార్ధులకు కూడా ఆశాకిరణాన్ని చూపింది. డేటా సెంటర్ల నుంచి ఫార్మా వరకు, అగ్రిటెక్ నుంచి FMCG వరకు… తెలంగాణలో పెట్టుబడుల విస్తరణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి భారీ బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు..
తాజావార్తలు
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
-
Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
-
Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!