NTV Telugu Site icon

Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..

Telangana Assembly 2024

Telangana Assembly 2024

Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. ధరణి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Read also: Astrology: ఆగస్టు 02, శుక్రవారం దినఫలాలు

ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా.. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కీలకమైన చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నాలుగో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జులై 31 అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరగనుంది.
Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?